Chandrababu: జనంలోకి వెళ్దాం
ABN , Publish Date - Jun 30 , 2025 | 02:39 AM
ఏ ప్రభుత్వమైనా చేసిన పనులు చెప్పుకోవాలి.. ఏ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్లడానికి నామోషీపడకూడదు అని టీడీ పీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. పనిచేయడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండడ మూ ముఖ్యమేనని..
నామోషీ వదిలి ‘తొలి అడుగు’ వేయండి
చేసిన మంచి చెప్పండి.. చేసింది చెప్పుకోలేకే గతంలో ఓడాం
వివేకా హత్య విషయంలో దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోయాం
ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా 2019లో ఓడిపోయేవాళ్లం కాదు
ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదు
వైసీపీ అబద్ధాలను తిప్పికొట్టాలంటే ఇంటింటికీ వెళ్లాల్సిందే
రాజకీయ ముసుగులో ఉండే క్రిమినల్స్‌తో జాగ్రత్త
కుట్రలను జనాలకు వివరించాలి.. టీడీపీ భేటీలో సీఎం స్పష్టీకరణ
తానా.. ఆటా.. అంటే టాటానే!
వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంట్ డౌన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. ఇప్పటికే ఏడాది పూర్తయింది. రెండో ఏడాది ప్రారంభమైంది. వచ్చే నెల రోజులూ ప్రజల్లో ఉంటూ ప్రతి ఇంటి గడపను తొక్కాలి. చాలా మంది తానా.. ఆటా అంటూ ఫారిన్ ట్రిప్పులకు వెళ్తున్నారు. తానా, ఆటా అంటే టాటా చెప్పేస్తా. - చంద్రబాబు
గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం దిశగా నడిపిస్తున్నాం. ఏడాదిలో అన్నీ చేశానని చెప్పడం లేదు. ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
తప్పుడు ప్రచారాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. నిజం గడప దాటేసరికి.. అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది. అందుకే వాస్తవాలను పదే పదే ప్రజలకు వివరించాలి.
- టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ‘ఏ ప్రభుత్వమైనా చేసిన పనులు చెప్పుకోవాలి.. ఏ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్లడానికి నామోషీపడకూడదు’ అని టీడీ పీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. పనిచేయడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండడ మూ ముఖ్యమేనని.. చేసిన మంచి పనులను పదే పదే వారికి తెలియజెప్పాలని.. అదే సమయంలో చేయలేకపోయిన పనులు ఎందుకు చేయలేదో వివరించాలని తెలిపారు. చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవడం మన లోపమని.. అం దుకే ఈసారి.. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి.. సం క్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పేందుకే జూలై 2 నుంచి ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. జాతీయ అధ్యక్షుడు మొ దలు కిందిస్థాయి కార్యకర్త వరకు నెల రోజులపాటు రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపూ తట్టాలని.. చేసిన మంచి వివరించాలని తెలిపారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నేతలు, శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ చెప్పే అబద్ధాలను తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే..
చేసింది చెప్పుకోలేక ఓడిపోయాం..
గతంలో మనం పనిచేయక ఓడిపోలేదు.. చేసింది చెప్పుకోలేకే ఓడిపోయాం. 1995లో నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి ని పరుగులు పెట్టించా. నాడు రాజకీయం వదిలే శాం. చేసిన పనులు ప్రజలకు చెప్పలేకపోయాం. 2019లోనూ అదే పొరపాటు పునరావృతమైంది. మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు వైసీపీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి. ప్రజలు 94 శాతం స్ట్రయిక్ రేటుతో మనల్ని గెలిపించారు. దానిని కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉంది. దక్షిణ భారతంలో ఏపీది విభిన్నమైన పరిస్థితి. రాష్ట్రాదాయంలో సేవల రంగం కీలకం. దీని నుంచి ఎక్కువ ఆదాయం రావలసి ఉన్నా కేవలం 46 శాతమే వస్తోంది. కాబట్టి ఈ రంగానికి ప్రాధాన్యమివ్వాలి. వ్యవసాయం నుంచి 35 శాతం రాబడి వస్తోంది. ఈ రంగాన్నీ అభివృద్ధి చేయాలి.
అప్పుడు అప్రమత్తంగా ఉండి ఉంటే..
నాడు అధికారం కోసం కోడికత్తి డ్రామా, బాబా యి హత్య వంటివి చేశారు. తర్వాత అధికారం నిలబెట్టుకోవడానికి గులకరాయి డ్రామా ఆడారు. నేడు సంఘ విద్రోహశక్తులను కూడగడుతున్నారు. గతం లో మాదిరిగా ప్రత్యర్థులు తప్పడు ప్రచారం చేసే అవకాశం ఈసారి ఇవ్వకూడదు. 2019 ఎన్నికల సమయంలో వివేకాని హత్య చేసి సాక్షిలో గుండెపోటుతో చనిపోయారని ప్రసారం చేశారు. నేనూ నిజమని నమ్మాను. మనం ఎన్నికల హడావుడిలో ఏమరుపాటులో ఉండగా.. హత్య చేసినవారు జాగ్రత్తపడ్డారు. వివేకా కూతురు వచ్చి పోస్టుమార్టం చేయాలని అడుగగా.. గొడ్డలివేటని తేలడంతో వెంటనే మాటమార్చి నా తండ్రిని, బాబాయిని చంపి నన్ను అనాథను చేశారంటూ కొత్త డ్రామా మొదలెట్టారు. నాపై నిందలేశారు. ఆ సమయంలో 2 గంటల సమ యం కేటాయించి, ఏమాత్రం అప్రమత్తంగా ఉండి సరిగ్గా వ్యవహరించినా.. హత్యచేసిన వారిని పట్టుకుని ప్రజల ముందు నిలబెట్టేవాళ్లం. ఎన్నికల్లో ఓటమిపాలయ్యేవాళ్లమూ కాదు.
గంజాయి బ్యాచ్‌లకు పరామర్శా?
ఆర్థిక ఉగ్రవాదులతో దేశానికి, రాష్ట్రానికి ఎంతో ప్రమాదం. రౌడీలు రాజకీయ ముసుగు వేసుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం. రాజకీయ నాయకులు పరామర్శలు చేయడంలో తప్పులేదు. కానీ గంజాయి బ్యాచ్‌లను, రౌడీషీటర్లనా పరామర్శించేది! తన కారు కిందే కార్యకర్త పడిపోతే పక్కనపడేసి వెళ్లిపోయారంటే ఏం చెప్పాలి? దీనికి సం బంధించిన ఆధారాలు లభ్యమైన తర్వాత కూడా తప్పుడు ఆరోపణలు చేస్తారా? ఓ పాస్టర్ ప్రమాదంలో చనిపోతే.. పోలీసులే చంపారని రాద్ధాంతం చేస్తున్నారు. దేశంలో ఏ పార్టీ కూడా వైసీపీలా బరితెగించి ప్రవర్తించడం లేదు. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఎవరినీ వదిలిపెట్టం.
మళ్లీ అదే విషం..
గతంలో అమరావతిపై విషం చిమ్మారు. ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నారు. మైనింగ్ ఆదాయం చూపి అప్పు తెస్తే లేఖలు రాస్తున్నారు. మనం వారిలా మద్యం ఆదాయం తాకట్టు పెట్టో, ప్రభుత్వ ఆస్తులు తనఖాపెట్టో అప్పులు తేవడం లేదు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే రుణ సమీకరణ చేస్తున్నాం. అప్పులతో సంక్షేమం చేయడం కాదు.. అభివృద్ధితో సంపద సృష్టించి సంక్షేమం చేయాలనేది మన ఆలోచన. గడచిన ఐదేళ్లలో ఏ పనీ చేయని వారు ఇప్పు డు రీకాల్ అంటూ మాట్లాడుతున్నారు. ఎవరిని రీకా ల్ చేయాలి? ఒక మాజీ సీఎం రప్పా రప్పా నరికితే తప్పు లేదంటారా? బూతులు మన విధానం కాదు. టీడీపీ ఉమ్మడి కుటుంబంలాంటిది. ఎర్రన్నాయుడు పార్టీ కోసం పనిచేశారు. ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. బాలయోగి చనిపోయేనాటికి హరీశ్ చిన్నవాడు. 2024 ఎన్నికల్లో ఎంపీగా సీటు ఇచ్చి గెలిపించుకున్నాం. అదీ బంధాల కు టీడీపీ ఇచ్చే విలువ. కేంద్రంలో కీలకంగా వ్యవహరించేలా చాలాసార్లు టీడీపీకి అవకాశాలు వచ్చా యి. అయినా మనం బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చే యం. మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. కేంద్రం సహకారం లేనిదే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఏడాదిలో బయటకు తెచ్చే వాళ్లం కాదు. విశాఖ స్టీల్ ప్లాంటును లాభాలబాట పట్టించే అవకాశం ఉండేది కాదు. అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు. సుస్థిర ప్రభుత్వం చాలా ముఖ్యం. సింగపూర్‌లో 60 ఏళ్లుగా ఒకే పార్టీ.. నలుగురు ప్రధానులు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే రాష్ట్రం రూపురేఖలు మారిపోయేవి.
సంక్షేమం.. అభివృద్ధిలో మనమే టాప్
దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఏడాదిలో రూ.9.34 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ప్రమోట్ చేస్తున్నాం. దేశంలోనే మొదటిసారి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తు న్నాం. సంక్షేమంలోను.. అభివృద్ధిలోనూ దేశం లో మనమే అగ్రభాగాన ఉంటాం. పాలసీలు ఎంత మంచివైనా.. అమల్లో తూట్లు పొడిస్తే సమస్యలు వస్తాయి. పొరపాటు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను.. ఎన్నికల ముందు కాదు.. నిత్యం ప్రజల్లో చర్చనీయాంశం చేయాలి.