London Visit: 2 నుంచి చంద్రబాబు లండన్ పర్యటన
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:44 AM
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో నవంబరు 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ రోడ్‌షో
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో నవంబరు 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ రోడ్ షోలను ప్లాన్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక ప్రముఖులు, పెట్టుబడిదారులు, విధానాల రూపకర్తలను విశాఖ వేదికపైకి చేర్చి ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా లండన్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ రోడ్‌షోలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. దీనికోసం నవంబరు 2 నుంచి 5 వరకు ఆయన లండన్‌లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఆయన ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రా కూడా లండన్ వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సీఎంవో ప్రధాన కార్యదర్శి (పొలిటికల్) ముఖేశ్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.