CM Chandrababu Naidu to Attend Nitish Kumars Swearing: నేడు పట్నాకు చంద్రబాబు, లోకేశ్
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:46 AM
బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరవుతున్నారు. ఇద్దరు నేతలకూ ఆహ్వానం....
నితీశ్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న నేతలు
వ్యక్తిగత కారణాలతో పవన్ గైర్హాజరు
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరవుతున్నారు. ఇద్దరు నేతలకూ ఆహ్వానం అందండంతో వారు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి పట్నా వెళుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడ బయలుదేరి మూడు గంటలకు అమరావతికి చేరుకుంటారు. కాగా, నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కూ ఆహ్వానం అందింది. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా కార్యక్రమానికి పవన్ హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.