Share News

AP CM Chandrababu: 30 ఏళ్లలో ఒక్క రోజూ సెలవు తీసుకోలేదు

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:47 AM

గత 30 ఏళ్లుగా అనారోగ్యమంటూ ఒక్కరోజు కూడా లీవ్‌ తీసుకోకుండా పనిచేస్తున్నా.. ఏ రోజూ అనారోగ్యం ఉందని కూడా చెప్పలేదు. కష్టపడుతున్న ప్రభుత్వ యంత్రాగాన్ని పనిచేయించి..

AP CM Chandrababu: 30 ఏళ్లలో ఒక్క రోజూ సెలవు తీసుకోలేదు

తొలిసారి సీఎం అయినప్పుడు పింఛను రూ.75 చేశా

2014లో రూ.200 నుంచి వెయ్యి, తర్వాత 2 వేలకు పెంచా

ఇప్పుడు 4 వేలకు తీసుకెళ్లా: సీఎం

ఇంటర్నెట్ డెస్క్: గత 30 ఏళ్లుగా అనారోగ్యమంటూ ఒక్కరోజు కూడా లీవ్‌ తీసుకోకుండా పనిచేస్తున్నా.. ఏ రోజూ అనారోగ్యం ఉందని కూడా చెప్పలేదు. కష్టపడుతున్న ప్రభుత్వ యంత్రాగాన్ని పనిచేయించి.. ప్రజలకు ఉపాధి కల్పించి వారి భవిష్యత్‌ బాగుకు కృషి చేస్తున్నాను. భర్త చనిపోతే ఆ నెల నుంచే భార్యకు పింఛను ఇచ్చే విధానం తీసుకొచ్చాను. ఒక నెల తీసుకోకపోయినా మరుసటి నెలలో పింఛన్లు ఇస్తున్నాం. దేశంలోనే సామాజిక పింఛన్లకు ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్‌. ఆయన తొలుత రూ.30 ఇచ్చారు. 30 ఏళ్ల క్రితం నేను తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 1995లో పింఛన్‌ను రూ.75కి పెంచాను. 2014లో నవ్యాంధ్ర సీఎంనైనప్పుడు రూ.200 పెన్షన్‌ను రూ.వెయ్యి, తర్వాత 2 వేలు చేశా. ఇప్పుడు రూ.4,000కి తీసుకెళ్లా. వృద్ధులకు, వితంతువులకు పది రెట్లు.. దివ్యాంగులకు 12 రెట్లు పెంచింది టీడీపీయే. ఎన్ని ఇబ్బందులున్నా ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నాం.. ప్రజలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.

- చంద్రబాబు

Updated Date - Sep 02 , 2025 | 04:48 AM