Share News

Local Market: బీసెంట్‌ రోడ్‌లో వ్యాపారులతో చంద్రబాబు మాటామంతీ

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:36 AM

ఆదివారం రాత్రి విజయవాడ బీసెంట్‌ రోడ్డులో సీఎం చంద్రబాబు పర్యటించారు. వివిధ వర్గాల వ్యాపారులతో ముచ్చటించారు.

Local Market: బీసెంట్‌ రోడ్‌లో వ్యాపారులతో చంద్రబాబు మాటామంతీ

విజయవాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆదివారం రాత్రి విజయవాడ బీసెంట్‌ రోడ్డులో సీఎం చంద్రబాబు పర్యటించారు. వివిధ వర్గాల వ్యాపారులతో ముచ్చటించారు. జీఎస్టీ తగ్గించిన తర్వాత వ్యాపారాల పరిస్థితి ఎలా ఉంది? అమ్మకాలు, కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? ఏయే వస్తువులపై ఎంతెంత ధరలు తగ్గాయి? అన్న విషయాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. బీసెంట్‌ రోడ్డులోని వ్యాపారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వీఽధి వ్యాపారి చింతలపూడి దుర్గారావు, సీఎం చంద్రబాబు మధ్య సంభాషణ ఇలా సాగింది.

చంద్రబాబు: ఏ వ్యాపారం చేస్తావు?

దుర్గారావు: జ్యూట్‌ బ్యాగులు, ప్రమిదల వ్యాపారం చేస్తుంటా

చంద్రబాబు: వ్యాపారం ఎలా ఉంది?

దుర్గారావు: అమ్మకాలు బాగున్నాయి.

చంద్రబాబు: రోజుకు ఎంత వ్యాపారం జరుగుతుంది?

దుర్గారావు: పెట్టుబడి ఖర్చులు వస్తున్నాయి.


తర్వాత సీఎం చంద్రబాబు వీధి వ్యాపారి యక్కలి బాలకృష్ణతో మాట్లాడారు. తర్వాత చెప్పుల షాపు యజమాని చదలవాడ వెంకటకృష్ణారావుతో ముచ్చటించారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ తగ్గుదల, విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వస్త్రదుకాణానికి వెళ్లి సేల్స్‌గర్ల్‌ గొడవర్తి లక్ష్మితో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం కిరాణా షాపు నిర్వాహకుడు బొడ్డు శ్రీనివా్‌సతో మాట్లాడారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ఎంత వరకు ఉందని అడిగారు. ఇంతకుముందు, ఇప్పుడు ధరల వ్యత్యాసం గురించి అడిగి సీఎం తెలుసుకున్నారు.

Updated Date - Oct 20 , 2025 | 04:37 AM