CM Chandrababu and Lokesh attended Nitish Kumar swearing: నితీశ్ ప్రమాణస్వీకారోత్సవంలో బాబు, లోకేశ్
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:42 AM
బిహార్ సీఎంగా నితీశ్‌కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. పట్నాలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ....
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): బిహార్ సీఎంగా నితీశ్‌కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. పట్నాలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. యూపీ, మహారాష్ట్ర సీఎంలు యోగి ఆదిత్యనాఽథ్, దేవేంద్ర ఫడణవీ్‌సను చంద్రబాబు, లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్, బీజేపీ అగ్రనేత రవిశంకర్ ప్రసాద్, బిహార్‌కు చెందిన పలువురు ఎన్డీయే నేతలతోనూ వారిరువురూ సమావేశమయ్యా రు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ ఎన్డీయే తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను చూసి పలువురు ఎన్డీయే నేతలు.. ‘లుక్ మారింది.. బాగా సన్నబడ్డారు.. ఏం డైట్ ఫాలో అవుతున్నారు? వ్యాయామాలేం చేస్తున్నారు?’ అంటూ వాకబు చేశారు.