ప్రపంచ శాంతికోసమే చండీయాగం
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:43 PM
ప్రపంచ శాంతి కోసమే మహానందిలో చండీయాగం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా సాయి సచ్చిదానంద ఆశ్రమం గురూజీ సాయిరాం తెలిపారు.
సాయి సచ్చిదానంద ఆశ్రమం గురూజీ సాయిరాం
మహానంది, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ శాంతి కోసమే మహానందిలో చండీయాగం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా సాయి సచ్చిదానంద ఆశ్రమం గురూజీ సాయిరాం తెలిపారు. మహానంది క్షేత్ర పరిధిలోని అఖిల భారత నిత్యాన్నదాన కరివెన సత్రం ఆవరణలో ఆదివారం సాయిరాం గురూజీ ఆధ్వర్యంలో బుత్వికలు వైభవంగా చండీహోమంతో పాటు ప్రత్యేక పూజలను వేదమంత్రాలతో నిర్వహించారు. ఈ ఏడాది మహానందిలో చండీ హోమంను మూడు రోజుల పాటు నిర్వహిస్తారని గురూజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.