Share News

AP Legislative Council: చైర్మన్‌ను అవమానించారని మండలిలో రచ్చ

ABN , Publish Date - Sep 27 , 2025 | 06:23 AM

ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెండు కార్యక్రమాలకు మండలి చైర్మన్‌ను ఆహ్వానించకుండా ఆయన్ను అవమానించిందని వైసీ పీ ఆరోపించింది. ఈ అంశంపైసభా నాయకుడైన సీఎం సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

AP Legislative Council: చైర్మన్‌ను అవమానించారని మండలిలో రచ్చ

  • పోడియం వద్ద వైసీపీ సభ్యుల ఆందోళన

  • ప్రభుత్వ కార్యక్రమాలకు చైర్మన్‌ను ఆహ్వానించరా?

  • మండలికే అవమానం:విపక్ష నేత బొత్స

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెండు కార్యక్రమాలకు మండలి చైర్మన్‌ను ఆహ్వానించకుండా ఆయన్ను అవమానించిందని వైసీ పీ ఆరోపించింది. ఈ అంశంపైసభా నాయకుడైన సీఎం సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం భోజ న విరామం తర్వాత మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల తిరుపతిలో జరిగిన పార్లమెంట్‌ మహిళా సభ్యుల సదస్సు, తాజాగా శాసనసభా ప్రాంగణంలో ప్రభుత్వ విప్‌లు, మీడియా పాయింట్‌ భవనం ప్రారంభోత్సవానికి మండలి చైర్మన్‌కు ఆహ్వానం లేదని చె ప్పారు. ఈ రెండు కార్యక్రమాలకు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ను ఆహ్వానించి, మండలి చైర్మన్‌ను పిలవకుండా అవమానించారని ఆరోపించారు. దీనిపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్‌ జోక్యం చేసుకున్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని వారు చెప్పినా.. వైసీపీ సభ్యులు చైర్మన్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. సీఎం వచ్చి సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. బొత్స మాట్లాడుతూ.. చైర్మన్‌కు జరిగిన అవమానం మండలి సభ్యులకూ జరిగినట్లేనని, దీనిపై చర్చ జరగాలని అన్నారు. చైర్మన్‌ ఎస్సీ అయినందునే అవమా నం జరిగిందని వైసీపీ సభ్యులు ఆరోపించా రు. దీనిపై చైర్మన్‌ మోషేన్‌రాజు జోక్యం చేసుకుని.. ‘నేను ఉన్నప్పుడు చర్చించడం సరికాదు.. ప్యానల్‌ చైర్మన్‌ను పెడదాం.. చర్చించుకోండి’ అంటూ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘మండలి చైర్మన్‌ను ఆహ్వానించాల్సిందే. కానీ సభ, మండలి ద్వా రా జరిగే ఏ కార్యక్రమానికీ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. సభలో స్పీకర్‌, మండలి లో చైర్మన్‌ ప్రధానం. పొరపాటు ఎక్కడ జరిగిందో అసెంబ్లీ సెక్రటరీని అడిగి తెలుసుకుం టాం. ఇలాంటి వాటికి కమిటీ ఉంది. సంబం ధం లేని విషయాన్ని, సంబంధం లేని వ్యక్తులకు ఆపాదించి మాట్లాడటం సరికాదు’ అని అన్నారు.


ఇలాంటి ఘటనలు ఆనవాయితీగా మారకూడదని బొత్స సూచించారు. సభను మరోసారి వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభించాక.. విపక్ష నేత బొత్స అదే అం శాన్ని ప్రస్తావించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ అధికారులను అడిగితే.. వేరే షెడ్యూల్‌ ఉందన్నట్లు.. మీరే రానని అన్నారని చెప్తున్నారు’ అని చైర్మన్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చైర్మన్‌ అన్నారు. ‘అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ఆయన అన్నారు. ఎస్సీ అనే చైర్మన్‌ పేరు వేయలేదని వైసీపీ సభ్యులు ఆరోపించారు. మంత్రులు మనోహర్‌, అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని కులాలు తెచ్చి చైర్మన్‌ స్థా నానికి ఆపాదించి, అగౌరవ పర్చవద్దని సూచించారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పేర్లు వేసి, చైర్మన్‌ పేరు ఎందుకు వేయలేదని ఎమ్మెల్సీ త్రిమూర్తులు నిలదీశారు. దీనిపై ప్రభుత్వ వివరణ ఏమిటని మంత్రులను చైర్మన్‌ అడిగారు. సీఎం వచ్చి సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ‘దీనిపై చర్చ కొనసాగిద్దామా? ప్రభుత్వ స్పందన తెలుపుతారా? కమిటీ ఏమైనా వేస్తారా? ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని వివరణ ఇస్తే.. విషయాన్ని ఇంతటితో ముగి ద్దాం’ అని చైర్మన్‌ అన్నారు. సభ్యులు కూర్చుంటే చర్చిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. అప్పటికీ గందరగోళం కొనసాగడం తో సభను వాయిదా వేశారు.

Updated Date - Sep 27 , 2025 | 06:24 AM