చైన్ స్నాచింగ్ కూలీలు
ABN , Publish Date - May 29 , 2025 | 01:32 AM
అతడు లుంగీ కట్టుకుని, ఒంటిపై బనియన్, మెడలో తువ్వాలుతో ఉంటాడు. సాదాసీదా చీరతో ఓ మహిళ అతడి వెంట ఉంటుంది. ఇద్దరూ చూడడానికి వ్యవసాయ కూలీలుగా కనిపిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్రవాహనంపై తిరుగుతారు. ఇలా తిరుగుతూనే ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఏదో చిరునామా అడిగినట్టుగా ఆ మహిళలను ఆపి మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కుపోతారు. ఇలా గ్రామీణ ప్రాంత మహిళలను టార్గెట్ చేసుకుని స్నాచింగ్‌లు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను విజయవాడ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, క్రైమ్స్ డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావు, ఏసీపీ వెంకటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ రామ్‌కుమార్ విజయవాడలోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో వెల్లడించారు.
వ్యవసాయ కార్మికుల వేషధారణలో చోరీలు
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలే లక్ష్యం
నలుగురిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
నిందితుల్లో ఇద్దరు మహిళలు
రూ.30లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం
అతడు లుంగీ కట్టుకుని, ఒంటిపై బనియన్, మెడలో తువ్వాలుతో ఉంటాడు. సాదాసీదా చీరతో ఓ మహిళ అతడి వెంట ఉంటుంది. ఇద్దరూ చూడడానికి వ్యవసాయ కూలీలుగా కనిపిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్రవాహనంపై తిరుగుతారు. ఇలా తిరుగుతూనే ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఏదో చిరునామా అడిగినట్టుగా ఆ మహిళలను ఆపి మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కుపోతారు. ఇలా గ్రామీణ ప్రాంత మహిళలను టార్గెట్ చేసుకుని స్నాచింగ్‌లు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను విజయవాడ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, క్రైమ్స్ డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావు, ఏసీపీ వెంకటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ రామ్‌కుమార్ విజయవాడలోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో వెల్లడించారు.
విజయవాడ, మే 28(ఆంధ్రజ్యోతి):
నెల్లూరు జిల్లా ఉప్పుటూరు గ్రామానికి చెందిన అచ్చి గిరిబాబు, అచ్చి మహేష్ అన్నదమ్ములు. గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకునేవారు. ఇద్దరూ కలిసి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. దీనితో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో బంగారం ధర విపరీతంగా పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు చేయడానికి ప్రణాళిక రచించారు.
ఒంటరి మహిళలతో సహజీవనం
గ్రామాల్లో భర్తతో విడిపోయిన మహిళలను గుర్తించి, వారికి అండదండగా ఉంటామని నమ్మించి జీవితంలోకి తెచ్చుకుంటారు. వారితో సహజీవనం చేస్తారు. అన్నదమ్ములు ఇద్దరూ చెరో మహిళను జీవిత భాగస్వామిగా చేసుకుంటారు. తర్వాత ద్విచక్ర వాహనాలపై వారిని ఎక్కించుకుని ఎంపిక చేసుకున్న గ్రామాల్లో నివాసం ఉంటారు. గ్రామాలకు శివారున ఉండే ఖాళీ స్థలాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. పాడి రైతులమని నమ్మించేందుకు రెండు గేదెలను గుడారం ముందు కట్టేస్తారు. తర్వాత వ్యవసాయ కూలీలుగా పనులకు వెళ్తారు.
చిరునామా అడుగుతున్నట్టు నటిస్తూ..
ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. వారి వద్దకు వెళ్లిన తర్వాత వాహనాన్ని ఆపి చిరునామా అడుగుతారు. వారు సమాధానం చెప్పేలోపు మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని పారిపోతారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 12 చైన్ స్నాచింగ్‌లు చేసి జైలుకు వెళ్లి వచ్చారు. తర్వాత మకాంను ఎన్టీఆర్ జిల్లాకు మార్చారు. ఇబ్రహీంపట్నం మండలం దొనబండకు చెందిన గాలేటి వెంకటరమణ అనే మహిళతో గిరిబాబు, మొగిలి సంధ్యతో మహేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ ఇద్దరూ చేసే స్నాచింగ్‌లకు వారిని మోటారు సైకిళ్లపై తీసుకెళ్లేవారు. ఈ గ్యాంగ్ రెండు తెలుగు రాషా్ట్రల్లో భారీగా చోరీలకు పాల్పడింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రెండు, జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలో మూడు, మైలవరం సర్కిల్ పరిధిలో నాలుగు, తిరువూరు సర్కిల్ పరిధిలో మూడు మొత్తం 12 చైన్ స్నాచింగ్‌లు చేశారు. ఇవి కాకుండా కృష్ణాజిల్లాలో నాలుగు, ఏలూరు జిల్లాలో రెండు, తెలంగాణలో ఏడు చైన్ స్నాచింగ్‌లు చేశారు. గిరిబాబు ఒక్కడే మొత్తం 15 చైన్ స్నాచింగ్‌లు చేశాడు. తమ్ముడు మహేష్‌తో కలిసి నాలుగు చోరీలు చేశాడు. సహజీవనం చేస్తున్న వెంకటరమణతో కలిసి మూడు, సంధ్యతో కలిసి మరో మూడు చైన్ స్నాచింగ్‌లు చేశాడు. ఈ నలుగురు నిందితుల నుంచి సీసీఎస్ పోలీసులు రెండు ద్విచక్ర వాహనాలు, 476 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.30లక్షలు ఉంటుంది. ఈ గ్యాంగ్‌ను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్‌ఐలు బాలయ్య, స్వామి, సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుళ్లు మిథున్, సురేష్, షబ్బీర్, రమణను సీపీ అభినందించారు. వారికి నగదు బహుమతులను అందజేశారు.