Refuses: ప్రభుత్వ జీతం.. ఫోనూ తీసుకోని చాగంటి
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:31 AM
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని, చాగంటి కోటేశ్వరరావును నైతిక విలువ అంశానికి సలహాదారుగా నియమించామని, ఆయన రూపొందించిన...
ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని, చాగంటి కోటేశ్వరరావును నైతిక విలువ అంశానికి సలహాదారుగా నియమించామని, ఆయన రూపొందించిన పుస్తకాలనే విద్యార్థులకు ఇస్తున్నామని మంత్రి లోకేశ్ మండలిలో చెప్పారు. ఆయన ఒక్క రూపాయి జీతం కానీ, ప్రభుత్వ సొమ్ముతో ఫోన్ కానీ, వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదన్నారు. చాగంటిని అందరూ అభినందించాలన్నారు. వైసీసీ సభ్యుడు సూర్యనారాయణ మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను విడిగా కూర్చోబెడుతూ వివక్ష చూపుతున్నారని చెప్పారు. దీనిపై లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తమ దృష్టికి రాలేదని, ప్రభుత్వం దృష్టి తెస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.