CEO Vivek Yadav: పక్కాగా ఓటరు జాబితాల మ్యాపింగ్
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:06 AM
రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి వివేక్‌యాదవ్ ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో పర్యటించారు.
బీఎల్‌ఓలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఆదేశం
అనంతగిరి (అల్లూరి జిల్లా), డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి వివేక్‌యాదవ్ ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో పర్యటించారు. కొత్తూరు పంచాయతీ శివలింగపురం గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో 280, 281 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అంతకుముందు బీఎల్‌వోల విధులు, పనితీరును పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల మ్యాపింగ్‌ను ఏ విధంగా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. 2026 ప్రత్యేక ఓటరు ముసాయిదా సవరణలో భాగంగా పాత ఓటరు జాబితాలతో సరిపోల్చి కచ్చితమైన జాబితాలను మ్యాపింగ్ చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. 280, 281 పోలింగ్ కేంద్రాల పరిధిలో 60 శాతం మ్యాపింగ్ పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాజకీయ పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడారు.