Dharmendra Pradhan: చంద్రబాబు దార్శనికతతో ఏపీలో నాణ్యమైన విద్య
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:40 AM
సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఏపీలో నాణ్యమై న విద్యావిధానాలు అమలవుతున్నాయని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు....
రాజ్యసభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఏపీలో నాణ్యమై న విద్యావిధానాలు అమలవుతున్నాయని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు. ఏపీలో నాణ్యమైన విద్యావ్యవస్థను సీఎం చంద్రబాబు, మంత్రి లోకే శ్ నెలకొల్పుతున్నారన్నారు. బుధవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘సీఎ్‌సఆర్ నిధులను వినియోగించడంలో ఏపీ అమలు చేస్తున్న విధానాలు ప్రశంసనీయం. ఏపీ మోడల్ దేశానికి ఆదర్శం. కావాలంటే ఏ రాష్ట్రమైనా ఇలాంటి విధానాన్ని తమ అవసరాలకు అనుగుణంగా అమలు చేసుకోవచ్చు. ఏపీలో సీఎ్‌సఆర్ నిధులతో పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.