Bhupathiraju Srinivas Varma: ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తాం
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:24 AM
ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా పరిశ్రమ దేశానికేగర్వ కారణమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.
రాష్ట్ర ఆక్వా ఎగుమతిదారులకు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ హామీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా పరిశ్రమ దేశానికేగర్వ కారణమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ అభివృద్థికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమకు చెందిన ఎగుమతిదారులతో శనివారం, ఆయన ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆక్వా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపె ఓపెన్ హౌస్ నిర్వహించి, ఎగుమతిదారులు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతుగా చర్చించారు. ఈ చర్చలో ముఖ్యంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను ఎగుమతిదారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఆక్వా పరిశ్రమను మరింత బలోపేతం చేసి, ఎగుమతులను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.