Share News

Union Minister Kirti Vardhan Singh: బనకచర్లపై మళ్లీ ప్రతిపాదనలు పంపాలన్నాం

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:52 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కోసం పర్యావరణ మదింపు అంచనా(ఈఐఏ) అధ్యయనం చేపట్టడానికి టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీవోఆర్‌) మంజూరు చేయాలని...

Union Minister Kirti Vardhan Singh: బనకచర్లపై మళ్లీ ప్రతిపాదనలు పంపాలన్నాం

  • రాజ్యసభలో కేంద్ర మంత్రి కీర్తివర్థన్‌సింగ్‌ వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కోసం పర్యావరణ మదింపు అంచనా(ఈఐఏ) అధ్యయనం చేపట్టడానికి టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీవోఆర్‌) మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పర్యావరణ, అటవీ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్‌ తెలిపారు. అయితే కేంద్ర జలసంఘం అనుమతులన్నీ తీసుకున్నాక టీవోఆర్‌ రూపకల్పనకు మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించినట్లు గురువారం రాజ్యసభలో చెప్పారు.

Updated Date - Aug 01 , 2025 | 06:52 AM