Share News

Union Minister Bhupathi Raju: యువ ఆస్ట్రోనాట్‌ జాహ్నవికి కేంద్ర సహకారం

ABN , Publish Date - Aug 22 , 2025 | 06:25 AM

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన యువ ఆస్ట్రోనాట్‌ జాహ్నవి దంగేటి(23)కి అవసరమైన శిక్షణ, భవిష్యత్‌ అంతరిక్ష పరిశోధనలకు సహకారాన్ని వ్యక్తిగతంగా, కేంద్ర ప్రభుత్వం...

Union Minister Bhupathi Raju: యువ ఆస్ట్రోనాట్‌ జాహ్నవికి కేంద్ర సహకారం

  • కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హామీ

న్యూఢిల్లీ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన యువ ఆస్ట్రోనాట్‌ జాహ్నవి దంగేటి(23)కి అవసరమైన శిక్షణ, భవిష్యత్‌ అంతరిక్ష పరిశోధనలకు సహకారాన్ని వ్యక్తిగతంగా, కేంద్ర ప్రభుత్వం తరపున అందిస్తామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హామీ ఇచ్చారు. అమెరికాలోని ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘టైటాన్‌ స్పేస్‌ ఇండస్ట్రీస్‌’ 2029లో నిర్వహించే అంతరిక్ష యాత్రకు ఎంపికైన జాహ్నవి దంగేటి గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిశారు. కేంద్ర మంత్రి ఆమెను సత్కరించి, అభినందించారు. జాహ్నవి లాంటి యువత దేశానికి గర్వకారణమన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 06:26 AM