Share News

Agriculture Department: రాష్ట్రానికి మరో 53 వేల టన్నుల యూరియా

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:13 AM

రాష్ట్రానికి అదనంగా 53వేల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని వ్యవసాయ శాఖ తెలిపింది. కాకినాడ పోర్టుకు...

Agriculture Department: రాష్ట్రానికి మరో 53 వేల టన్నుల యూరియా

  • రికార్డు స్థాయిలో కేటాయించిన కేంద్రం

  • ఎరువుల కొరత లేదు: వ్యవసాయ శాఖ

రాష్ట్రానికి అదనంగా 53వేల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని వ్యవసాయ శాఖ తెలిపింది. కాకినాడ పోర్టుకు 17,154 టన్నులు, గంగవరం పోర్టుకు 26,547టన్నులు, కృష్ణపట్నం పోర్టుకు 9,200 టన్నుల యూరియా చేరుకుందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. గత 10 రోజుల్లో 22వేల టన్నుల యూరియా రాగా, వచ్చే 10 రోజుల్లో మరో 30వేల టన్నులు రానున్నట్లు తెలిపింది. దేశీయంగా వివిధ కంపెనీల ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని, రైతులకు ఎరువుల కొరత లేదని స్పష్టం చేసింది. రబీ సీజన్‌లోనూ ఎరువుల కొరత ఉండదని తెలిపింది.

Updated Date - Sep 03 , 2025 | 04:14 AM