Central Cabinet Approvesఫ ఏపీలో సెమీ కండక్టర్ ప్రాజెక్టు
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:15 AM
ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.
468 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
తిరుపతి ఎలకా్ట్రనిక్స్ క్లస్టర్‌లో ప్రాజెక్టు నిర్మాణం
ఏటా 9.6 కోట్ల చిప్‌లు ఉత్పత్తి చేసే సామర్థ్యం
క్రమంగా రూ. 1500 కోట్లకు పెట్టుబడులు
క్యాబినెట్ నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సాధ్యమైంది: లోకేశ్
యువతకు ఉపాధి లభిస్తుంది: రాష్ట్ర బీజేపీ
అమరావతి/న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దేశంలో నాలుగు చోట్ల రూ. 4,594 కోట్లతో చిప్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఇందులో భాగంగా రూ. 468 కోట్ల పెట్టుబడితో ఏపీలో అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్(ఏఎస్ఐపీ) సంస్థ సెమీ కండక్టర్ యూనిట్‌ను స్థాపించేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ సంస్థకు ఏటా 9.6 కోట్ల చిప్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ యూనిట్‌ను రాష్ట్రంలో స్థాపించాలంటూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఏఎ్‌సఐపీని ఆహ్వానిస్తూ లేఖ రాసింది. ఆ సంస్థ తెలిపిన సమ్మతిని కేంద్రాని కి రాష్ట్రం వివరించింది. దీనికి కేంద్రం ఆమోద ము ద్రవేసింది. తిరుపతి ఎలాట్రానిక్ క్లస్టర్‌లో సెమీ కండక్టర్ యూనిట్‌ను స్థాపించేందుకు మార్గం సుగమమైంది. ప్రాథమికంగా రూ.468 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సమ్మతి తెలిపిన ఏఎ్‌సఐపీ.. క్రమంగా పెట్టుబడులను విస్తరిస్తూ రూ.1,500 కోట్లకు తీసుకువెళ్లే ఆలోచనలో ఉందని అధికారవర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి.
రాయలసీమలో ఎలక్ట్రానిక్ క్లస్టర్..
విశాఖపట్నం, అమరావతిలో సాఫ్ట్‌వేర్ పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రాయలసీమలోఎలాట్రానిక్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను అమలు చేస్తోంది. 2014-19 మధ్య కాలంలోనే తిరుపతిని ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌గా ప్రకటించారు. తాజాగా ఏఎ్‌సఐపీ సెమీ కండక్టర్ యూనిట్ స్థాపనతో ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు మ రింత జోరందుకోనున్నాయి. ఏఎ్‌సఐపీకి ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ రాసిన లేఖలో ఆ సంస్థకు ఇచ్చే రాయితీల ను ప్రస్తావించారు. మూలధన పెట్టుబడిలో 25 శా తం రాయితీని ఇస్తారు. నామమాత్రం ధరకు భూ మిని ఇస్తారు. ఐదేళ్ల పాటు విద్యుత్తును యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీకి అందిస్తారు. అలాగే ఐదేళ్ల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీకి మినహాయింపునిస్తారు. టర్మ్‌లోన్ వడ్డీపై ఐదేళ్లపాటు సబ్సిడీ, ఎస్‌జీఎస్టీని పూర్తిగా ఐదేళ్లపాటు మినహాయిస్తారు.
సీఎం చంద్రబాబు హర్షం
రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్‌ను కేటాయి స్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఫోన్ చేశారు. ప్రధాని మోదీకి, కేంద్రానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఏఎస్ఐపీ టెక్నాజీస్, దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కంపెనీ లిమిటెడ్‌కు సీఎం స్వాగతం పలికారు. మొబైల్స్, సెట్ టాప్ బాక్సులు, ఆటోమోటివ్ ఈసీయూ, గృహ వినియోగ ఎలక్ట్రానిక్స్ పరికరాలకు ఈ యూనిట్‌లో సెమీ కండక్టర్ల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు.
ప్రధాని మోదీకి లోకేశ్ ధన్యవాదాలు
రాష్ట్రానికి సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కంపెనీ, ఏఎస్ఐపీ కలసి రాష్ట్రంలో ఏటా 9.6 కోట్ల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతుందని చెప్పారు.
ఏపీ దిశ మారుతుంది: యామినీ శర్మ
సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ రాష్ట్ర దిశను మార్చబోతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ చెప్పారు. ఫోన్‌లు, రక్షణ, ఎలక్ర్టిక్ వా హనాలు, ఏఐకు శక్తిని ఇచ్చే చిప్‌లు త యారవుతాయని, యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు.
నాలుగు చోట్ల చిప్ పాంట్లు
దేశీయంగా చిప్‌లను తయారు చేసే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతునిస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మంగళవారం తెలిపారు. మొత్తం రూ.4,594 కోట్లతో కొత్తగా 4సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వీటిని ఒడిశా, పంజాబ్, ఏపీలో ఏర్పాటు చేస్తామన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రూ.2,066 కోట్ల తో సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్‌లో రూ.468 కోట్లతో చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్‌ను అడ్వాన్స్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజి టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పంజాబ్‌లో సీడీఐఎల్ సంస్థ రూ.117 కోట్లతో ఏటా 15.8 కోట్ల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.