Share News

Pemmasani Chandrasekhar: తోతాపురికి కేంద్రం మద్దతు

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:19 AM

తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడానికి కిలోకు రూ.4 చొప్పున మొత్తం రూ.260 కోట్లు విడుదల చేయడమన్నది రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం.

Pemmasani Chandrasekhar: తోతాపురికి కేంద్రం మద్దతు

  • 260 కోట్లు విడుదల... ముందుగానే భరించిన రాష్ట్రం: పెమ్మసాని

న్యూఢిల్లీ, అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ‘తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడానికి కిలోకు రూ.4 చొప్పున మొత్తం రూ.260 కోట్లు విడుదల చేయడమన్నది రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం. ఇందులో రాష్ట్రం భరించిన రూ.130 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించేలా మార్కె ట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ ద్వారా చర్యలు తీసుకోగలిగాం’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చం ద్రశేఖర్‌ అన్నారు. ‘తోతాపురి మామిడి పంటకు తొలిసారి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌(ఎంఐఎస్‌) అమ లు చేయడం ద్వారా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి మద్దతు ఇచ్చాయి. ఈ స్కీమ్‌ ప్రకారం ఖర్చులో 50ు కేంద్రం, 50ు రాష్ట్రం భరించాలి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఇచ్చిన రూ.130 కోట్లను కేంద్రం తిరిగి చెల్లించేందుకు ఆదేశాలు వెలువడ్డాయి’ అని పెమ్మసాని అన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 05:20 AM