Family Celebration: కేంద్ర మంత్రి రామ్మోహన్ ఇంట సందడి
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:12 AM
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి ఇంట సందడి నెలకొంది.
కేంద్ర మంత్రులు, టీ సీఎం రేవంత్ హాజరు
న్యూఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి ఇంట సందడి నెలకొంది. ఆదివారం ఢిల్లీలోని కేంద్రమంత్రి అధికారిక నివాసంలో ఆయన కుమారుడి బారసాల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లోద్ జోషి, శ్రీనివాస వర్మ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, రామ్మోహన్ బాబాయి మంత్రి అచ్చెన్నతోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.