వేడుకగా 79వ స్వాతంత్య్ర దినోత్సవాలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:56 PM
79వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాలయాలు, కార్యాలయాల వద్ద మువ్వన్నెల జెండాలు ఎగురవేశారు. మదనపల్లె సబ్‌కలెక్టరేట్ వద్ద సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి జాతీయ జెండా ఎగురవేసి మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

వేడుకగా 79వ స్వాతంత్య్ర దినోత్సవాలు
వాడవాడలా రెపరెపలాడిన మువ్వెన్నెల జెండా
గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన సబ్‌కలెక్టర్ కళ్యాణి
మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
79వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాలయాలు, కార్యాలయాల వద్ద మువ్వన్నెల జెండాలు ఎగురవేశారు. మదనపల్లె సబ్‌కలెక్టరేట్ వద్ద సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి జాతీయ జెండా ఎగురవేసి మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కె.ప్రమీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాష త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యుత్ బకాయిలు వంద శాతం వసూలు సాధించినందుకు పీలేరు ఏపీ ట్రాన్స్‌కో ఈఈ చంద్రశేఖర్ రెడ్డికి తిరుపతిలో ప్రశంసా పత్రం అందించారు. పెద్దతిప్పసముద్రం ఉపాధిహామీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించ లేదు. వివరాల్లోకెళితే....
జడ్పీహైస్కూల్‌లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే షాజహాన్‌బాష, కమిషనర్ ప్రమీల
మదనపల్లె/మదనపల్లె టౌన్/అర్బన్ ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): పట్టణం లోని వివిధ కార్యాలయాల్లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వ హించారు. సబ్‌కలెక్టరేట్ వద్ద సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి జాతీయ జెండా ఎగురవేసి మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఉత్తమ సేవ లందించిన రెవెన్యూ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ము న్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజ హాన్‌బాష త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. హంద్రీ-నీవా కార్యాలయం లో ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్, ఈఈ సి.ఆర్.రాజ్‌గోపాల్, శ్రీధర్‌రెడ్డి మువ్వె న్నెల జెండాను ఆవిష్కరించారు. సబ్‌రిజిస్ర్టార్, గృనిర్మాణశాఖ కార్యాల యాల్లో సబ్‌రిజిస్ట్రార్ గురుస్వామి, డీఈ దీన్‌దయాల్‌రాజు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఉత్తమ సేవలు అందించిన సబ్‌రిజిస్ర్టార్ గురుస్వామి, హౌసింగ్ డీఈ దీన్‌దయాల్‌రాజు రాయచోటిలో మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ నుంచి ప్రశంసాప్రతం అందుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, జడ్పీహైస్కూల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, టిప్పుసుల్తాన్ మైదానాల్లో ఎమ్మెల్యే షాజహాన్‌బాష జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాల యంలో బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖ ర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని తహసీల్దార్ కిషోర్ కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు.
డీటీ వెంకటస్వామి, ఆర్‌ఐ బాలసు బ్రహ్మణ్యం, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం, వీఆర్వోలు, సిబ్బంది, బీసీ హక్కుల పోరాట సమితి నేతలు పాల్గొన్నారు. మదనపల్లె డీఎస్పీ కార్యా లయంలో డీఎస్పీ మహేంద్ర, తాలుకా, వన్‌టౌన్, టూటౌన్, పోలీసు స్టేషన్లలో ఆయా సీఐలు కళా వెంకటరమణ, మహమ్మద్ రఫీ రాజారెడ్డి జాతీయ పతాకాలు ఎగురవేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరిం టెండెంట్ డాక్టర్ కోటేశ్వరి జెండాను ఎగరవేశారు. జడ్పీ హైస్కూల్ నుంచి 1000 అడుగుల జాతీయ జెండాను పురవీధుల్లో ఊరే గించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యల్లంపల్లె ప్రశాంత్, బీజేపీ నేత వరదారెడ్డి నారధరెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఓంప్ర కాష్, వాసవీక్లబ్ రిజనల్ జోన్ చైర్మన్లు బి.నరేంద్ర కుమార్, ఎ.జ్యోతి ప్రారంభించారు. కురవంక సచివాలయం, ప్రాథమిక పాఠశాల్లో స్వాతం త్య్ర దినోత్సవాలు నిర్వహించారు. కురవంక సర్పంచ్ చలపతి, ఉపస ర్పంచ్ నాగరాజ, వార్డుమెంబరు కృష్ణమూర్తి పాల్గొన్నారు. కాంగ్రెస్ కా ర్యాలయంలో నేత రెడ్డిసా హెబ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
పెద్దమండ్యం మండలంలో....
పెద్దమండ్యం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ కార్యాలయం ఎదు ట తహసీల్దార్ తేజశ్వి, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎంపీపీ పూర్ణ చంద్రిక, పీహెచ్‌సీలో డాక్టర్ అశోక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణల్లో వారి చిత్రపటా లు, జాతీయజెండాలతో విద్యార్థుల ఊరేగింపులు ఆకట్టుకున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నిమ్మనపల్లి మండలంలో....
నిమ్మనపల్లి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని ప్రభుత్వ పా ఠశాలలు, కార్యాలయాల్లో మువ్వన్నెల జండాను ఎగురవేశారు. కళాశాల, జడ్పీహైస్కూల్ విద్యార్థులు జాతీయ జెండాను ఎగువేశారు. ఎంపీడీఓ రమేష్ ఆధ్వర్యంలో జాతీజండాను ఎగువేశారు. ఎంఈఓ-1 పద్మావతి, ఎంఈఓ-2 నారాయణ, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు.
కురబలకోట మండలంలో...
కురబలకోట, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మండలంలో స్వాతంత్య్రదినోత్స వాలను చేసుకున్నారు. పోరాట యోధుల చిత్రపటాలకు నివాళులర్పించి, వారి సేవలను కొనియాడారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ భూదే వి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ధనంజయులు, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఓ ద్వారకనాధ్, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, పాఠశాలల్లో హెచ్‌ఎంలు జాతీయ జెండాను ఎగురవేశారు. డీమ్డ్ టు బీ మిట్స్ యూనివర్సిటీలో కరెస్పాండెంట్ విజయభాస్కర్ చౌదరి, గోల్డెన్ వ్యాలీలో కరెస్పాండెంట్ ఎన్‌వీ రమణారెడ్డి, విశ్వం ఇంజ నీరింగ్, డిగ్రీ కళాశాలలో చైర్మెన్ విశ్వం ప్రభాకర్‌రెడ్డి, తదితరులు జెండా ను ఎగుర వేశారు. ఎంపీడీఓ గంగయ్య, జడ్పీటీసీ బి.జ్యోతి, సర్పంచ్ విశ్వనాథరెడ్డి, మండల కన్వీనర్ వై.జి.సురేంద్ర పాల్గొన్నారు.
ములకలచెరువు మండలంలో...
ములకలచెరువు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మండలంలో స్వాతంత్య్ర దినో త్సవాలు జరిగాయి. ములకలచెరువు మార్కెట్ కమిటీ కార్యాలయం, బురకాయలకోట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీఐ వెంటేశులు, తహసీల్దార్ ప్రదీ ప్, ట్రాన్స్‌కో ఏఈ శేషు, ఏపీఎం మధుబాబు జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. టీడీపీ నేతలు గుత్తికొండ త్యాగరాజు, యర్రగుడి సురేష్, కేవీ రమణ, మస్తాన్‌రెడ్డి, ఫాస్టర్ శ్రీనివాసులు, ఫజులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుభాషిణి పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రం మండలంలో...
పెద్దతిప్పసముద్రం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలో స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో శ్రీరాములు నాయక్, మండల పరిషత్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శ్రీధర్ మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బస్టాండు కూడలిలో బీఎంఎస్ ఆటో వర్కర్స్ యూనియన్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. మాజీ సర్పం చ్ రియాసత్ అలీఖాన్, యూనియన్ అధ్యక్షుడు నరసింహులు, అంజి, టి. సూరి, శివనంది, టి. అంజి, సోమశేఖర్, శంకర పాల్గొన్నారు.
బి.కొత్తకోట మండలంలో...
బి.కొత్తకోట, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): నగరపంచాయతీ సహా మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు చేసుకున్నారు. విధ్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలు ఆకట్టుకున్నా యి. నగరపంచాయతీ కార్యాలయంలో కమిషనర్ జీవీపల్లవి, తహసీ ల్దార్ కార్యాలయంలో బావాజాన్, మండలపరిషత్‌లో ఎంపీడీఓ కృష్ణవే ణి, పోలీస్‌స్టేషన్‌లో సీఐ గోపాల్‌రెడ్డి, ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ భాగ్యమ్మ, స్త్రీశక్తి భవన్‌లో ఏపీఎం రాజేశ్వరి, ఆదిత్య డిగ్రీ కాలేజిలో ప్రిన్సిపాల్ ప్రసాద్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.
తంబళ్లపల్లె మండలంలో...
తంబళ్లపల్లె, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, విద్యా సంస్థల్లో వేడుకలు చేసుకున్నా రు. సివిల్ కోర్డులో ఇన్‌చార్జి న్యాయాధికారి కీర్తన, ఎంపీడీఓ కార్యాల యంలో ఎంపీడీఓ థామస్‌రాజ, ప్రభుత్వాస్పత్రిలో వైద్యాధికారి తేజశ్విని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా ఎస్‌ఎంసీ చైర్మన్లు పతాకం ఎగురవేశారు.
రామసముద్రం మండలంలో....
రామసముద్రం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మండలంలో స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. భరతమాత, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూజలు చేసి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఎంపీడీఓ గపూర్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్‌గౌడ్ జెండా ఆవిష్కరణ చేశారు. కోలా హరినాథ్ ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది టెన్త్‌లో ఎక్కువ మార్కులు సాధించిన 16మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

తిరుపతిలో విశిష్ట సేవా అవార్డు అందుకున్న పీలేరు విద్యుత్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డి
ఊరూ..వాడా... రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
పీలేరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): పీలేరు మండల ప్రజలు 79వ స్వాతంత్య్ర దినోత్సవం పండుగ వాతావరణంలో చేసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, మాజీ సైనికుల కార్యాలయం, ఆర్టీసీ డిపో, స్వ చ్ఛంద సంస్థల కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. కోర్టుల ప్రాంగణలో 11వ అదనపు జిల్లా జడ్జి మహేశ్, ఏజేసీజే శ్రీనివా సులు, అర్బన్ పోలీసు కార్యాలయంలో సీఐ యుగంధర్, రెవెన్యూ కార్యా లయంలో తహసీల్దారు శివకుమార్, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీఓ శివశంకర్, వైఎస్-ఎంపీపీ హరిత, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ హబీబ్, ఆర్టీసీ డిపోలో డీఎం నిర్మల, ఏపీఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలో ఈఈ చంద్రశేఖర రెడ్డి, ఏఎంసీ ప్రాంగణలో చైర్మన్ పురం రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ యల్లెల రెడ్డప్పరెడ్డి, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్-రిజిస్త్రార్ శివకుమారి, ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయంలో అధ్యక్షుడు చంద్రా రెడ్డి, ఎంజేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చైర్మన్ ఎం.పి. అవినాశ్, ప్రిన్సి పాల్ కేవీఎన్‌వీఎన్ రావు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకా లను ఎగురవేశారు. శ్రీ భువన విద్యాలయం విద్యార్థులు కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. చౌడేశ్వరి ఆలయం వద్ద తొగట వీరక్షత్రి య సంఘం, చేనేత కార్మికులు పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు కరస్పాండెంట్లు వడ్లమూడి మాధవి పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో...
వాల్మీకిపురం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాలను చేసుకున్నారు. స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి గురుఅరవింద్, రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ పామిలేటి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మనోహర్‌రాజు, పోలీస్ స్టేషన్ వద్ద సీఐ రాఘవరెడ్డి, ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ లత, పోస్టాఫీస్ వద్ద పోస్టుమాస్టర్ నిరంజన్‌కుమార్, ప్రభుత్వాస్పత్రిలో సూప రింటెండెంట్ రవికుమార్, విద్యుత్ సబ్‌స్టేషన్, ట్రాన్స్‌కో కార్యాలయాల వద్ద ఏఈ రాజశేఖర్‌బాబు, రిజిస్టర్ కార్యాలయం వద్ద సబ్‌రిజిస్టర్ స్వరూప్‌కుమార్, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గంగులమ్మ, ఈఓ రవీంద్రనాథ్, మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ చంద్రమౌళి ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో జాతీయ జెండా ఎగుర వేశారు. పాతబస్టాండ్‌లోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. వివిధ పార్టీల రాజకీయ నేతలు, యువత విద్యార్థు లు పాల్గొన్నారు. పట్టణంలో సీనియర్ సిటిజన్ ఆధ్వ ర్యంలో కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకున్నారు.

పీలేరు కోర్టులో జెండా వందనం చేస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు
గుర్రంకొండలో...
గుర్రంకొండ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ లక్ష్మీప్రసన్న, ఎంపీడీఓ కార్యాలయంలో ఈఓఆర్డీ బ్రహ్మా నందరెడ్డి, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ మూర్తిరావు జాతీయ జెండాను ఎగురువేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల్లో జెం డాను ఎగురువేసి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో నేతలు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలకడ మండలంలో...
కలకడ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర దినోత్సవాలను మండలంలో ఘనంగా చేసుకున్నారు. సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహేశ్వరిబాయి, ఎంపీడీఓ కార్యాలయంలో జగదీశ్వర్, పోలీస్‌స్టేషన్ సీఐ లక్ష్మన్న జెండాను ఆవిష్కరించారు.