Share News

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి డిసెంబర్లో పూర్తిస్థాయి మరమ్మతులు

ABN , Publish Date - May 22 , 2025 | 06:09 AM

శ్రీశైలం జలాశయంలో ప్లంజ్‌పూల్‌, స్టీల్‌ సిలెండర్లు వంటి కీలక నిర్మాణాలకు వచ్చే డిసెంబరులో పూర్తి మరమ్మతులు చేయాలని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల బృందం నిర్ణయించింది. వర్షాలు, వరదల కారణంగా ఆటంకాలు ఏర్పడకుండా మరమ్మతులు ఇప్పుడే కాకుండా డిసెంబరులోనే ప్రారంభించాలని సూచించారు.

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి డిసెంబర్లో పూర్తిస్థాయి మరమ్మతులు

అంత ప్రమాదకర పరిస్థితేం లేదు

ఆందోళన చెందాల్సిన పని లేదు

జూన్‌ మొదటి వారంలో మళ్లీ వస్తాం!

ఆలోగా చెప్పిన పరీక్షలు పూర్తి చేయండి

శ్రీశైలం ఇంజనీర్లకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ బృందం సూచన

అమరావతి, మే 21 (ఆంరధజ్యోతి): ప్లంజ్‌పూల్‌, స్టీల్‌ సిలెండర్లు సహా శ్రీశైలం జలాశయంలో దెబ్బతిన్న కీలక నిర్మాణాలకు వచ్చే డిసెంబర్లో పూర్తిస్థాయి మరమ్మతులు చేయాలని కేంద్ర జల-విద్యుత్‌ పరిశోధనా కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తల బృందం నిర్ణయించింది. భాక్రా-నంగల్‌ డ్యాంలో కూడా ప్లంజ్‌పూల్‌ దెబ్బతింటే తాము మరమ్మతు చేశామని తెలిపింది. దానితో పోల్చినప్పుడు శ్రీశైలంలో అంత ప్రమాదకర పరిస్థితేం లేదని స్పష్టంచేసింది. అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. మరమ్మతులు ఇప్పుడు మొదలుపెడితే వర్షాలు, వరదల రూపంలో ఆటంకాలు ఏర్పడతాయని తెలిపింది. అదే డిసెంబరులో అయితే ఇలాంటి అడ్డంకులు రావని పేర్కొంది. వచ్చే నెల మొదటివారంలో పూర్తి సన్నద్ధతతో మరోసారి శ్రీశైలం జలాశయం పరిశీలనకు వస్తామని తెలిపింది. ఈలోపు.. జలాశయంలో దెబ్బతిన్న కీలక నిర్మాణాలపై తాము సూచించిన పరీక్షలు నిర్వహించాలని శ్రీశైలం డ్యాం ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించింది.


ఈ సంస్థ శాస్త్రవేత్తలు డ్యాం ప్రాంగణంలో బుధవారం పర్యటించారు. అప్రోచ్‌ రోడ్‌, యాప్రాన్‌, ప్రాజెక్టు ప్రాంతంలో ఒరిగిపోయిన రాతి గోడలు, డ్యాం భద్రతలో కీలక భూమిక వహించే స్టీల్‌ సిలెండర్లు, అండర్‌ గ్రౌండ్‌ ప్రాంతంలో కట్టడాలు, ప్లంజ్‌పూల్‌ ప్రాంతాలను సందర్శించారు. యాప్రాన్‌కు బోర్‌వెల్స్‌ సాయంతో రంధ్రాలు చేసి పరిశోధించిన నివేదికను తమకు అందించాలని ఇంజనీర్లకు సూచించారు. ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని ఏ పద్ధతిలో పూడ్చాలో.. తమ ప్రధాన కార్యాలయం ఉన్న పుణేలో ఓ మోడల్‌ రూపొందించాలని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు నిర్ణయించారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 06:09 AM