YSRCP Worker Kanaka Rao: కేసులు మాకు.. ప్రసంగాలు మీకా
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:21 AM
వైసీపీ నేతల వైఖరిపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. నాయకులు రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలపై తాజాగా ఓ కార్యకర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలను నిలదీసిన కార్యకర్త
ఏలూరురూరల్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల వైఖరిపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. నాయకులు రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలపై తాజాగా ఓ కార్యకర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేసులు మాకు ప్రసంగా లు మీకా?’’ అంటూ నిలదీశారు. మంగళవారం ఏలూరు లో వైసీపీ జిల్లా విసృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు హాజరయ్యారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో దెందులూరు గ్రామానికి చెందిన కార్యకర్త కనకారావు ఆగ్రహంతో రగిలిపోయారు. ‘‘పార్టీ కోసం కష్టపడి పని చేస్తుంటే కనీసం మమ్మల్ని పట్టించు కోవడం లేదు.’’ అన్నారు. మీరు చేస్తున్న ప్రసంగాలతో పోలీసులు మాపై కేసులు పెడుతున్నారని, అసలు దళి తులకు పార్టీ ఏం చేస్తుందో చెప్పాలని కనకారావు ప్రశ్నిం చారు. ‘‘జగన్ హయాంలో ఏం జరిగింది?. దళితుల కోసం వైసీపీ ఏం చేసింది? ఏం చేస్తోందో చెప్పాలి.’’ అని బిగ్గర గా అరడంతో కార్యకర్తలు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వేదికపై ఉన్న నాయకులు ఒక్కసారిగా అవాక్క య్యారు. కార్యకర్త ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.