Jagan Newspaper: జగన్ పత్రికపై కేసు నమోదు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:53 AM
పోలీసు శాఖ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తప్పుడు కథనం ప్రచురించిన జగన్ పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు...
అమరావతి/గుంటూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తప్పుడు కథనం ప్రచురించిన జగన్ పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోతపత్రికపై కేసు నమోదైంది. డీఎస్పీల పదోన్నతుల్లో జాప్యానికి అవినీతి కారణం అంటూ ‘పైసా మే ప్రమోషన్’ పేరుతో జగన్ పత్రిక దురుద్దేశపూర్వకంగా ఓ కథనం ప్రచురించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశంతో కుట్ర పూరితంగా తప్పుడు కథనాన్ని ప్రచురించి పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించిన జగన్ పత్రిక ఎడిటర్, బ్యూరో చీఫ్, క్రైమ్ రిపోర్టర్లపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో తాడేపల్లి పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దుష్ప్రచారం చేయడం, వర్గ వైషమ్యాలను రేకెత్తించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం వంటి బీఎన్‌ఎస్ సెక్షన్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి.