Photo Morphing: డిప్యూటీ సీఎం ఫొటోల మార్ఫింగ్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:12 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేయడంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు.
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేయడంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ కాళ్లు పవన్ పట్టుకున్నట్టుగా ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ తిరుపతి జనసేన నేత కిరణ్‌రాయల్ ఆధ్వర్యంలో ఆ పార్టీ లీగల్ సెల్ నేతలు అదనపు ఎస్పీ రవిమనోహరాచారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో వైసీపీ పేటీఎం బ్యాచ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు చెప్పారు.