TTD Board: జగన్ మేనమామపై కేసు నమోదు
ABN , Publish Date - Aug 12 , 2025 | 07:09 AM
తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిపై కేసు నమోదైంది.
తిరుమలలో రవీంద్రనాథ్‌రెడ్డి రాజకీయ వ్యాఖ్యలపై చర్యలు
తిరుమల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకున్న అనంతరం రవీంద్రనాథ్‌రెడ్డి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తిరుమల పవిత్రతను కాపాడటానికి ఏడు కొండల ప్రాంతంలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తూ గత నవంబరు 18న టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని, రవీంద్రనాథ్‌రెడ్డి ఈ నిబంధనలను ఉల్లంఘించారని టీటీడీ విజిలెన్స్ వీఐ దామోదర్ ఆదివారం రాత్రి తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ పీఆర్ యాక్ట్-1994, ఆర్‌డబ్ల్యూ 114 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్-1984, 223 బీఎన్‌ఎ్‌స సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.