Share News

Palnadu District: తప్పుడు కథనం రాసిన జగన్‌ పత్రికపై కేసు

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:28 AM

సరైన ఆధారాలు లేకుండా తప్పుడు కథనం ప్రచురించినందుకు జగన్‌ పత్రికపై కేసు నమో దు చేసినట్లు పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌...

Palnadu District: తప్పుడు కథనం రాసిన జగన్‌ పత్రికపై కేసు

నరసరావుపేట లీగల్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): సరైన ఆధారాలు లేకుండా తప్పుడు కథనం ప్రచురించినందుకు జగన్‌ పత్రికపై కేసు నమో దు చేసినట్లు పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ హరిబాబు తెలిపారు. నరసరావుపేట బరంపేటలోని చాకిరాలమిట్టకు చెందిన పి.కోటేశ్వరరావు(50) సోమవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి గొంతు ఎండిపోయి మృతి చెందాడు. ఈ మేరకు రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ అంశంపై జగన్‌(సాక్షి) పత్రికలో నకిలీ మద్యం తాగి చనిపోయినట్లు కథ నం ప్రచురితమైంది. దీనిపై మృతుడి భార్య అలివేలు గురువారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Oct 11 , 2025 | 05:32 AM