Cancer Screening: ఎన్‌సీడీ 4.0లో 39 లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:22 AM
క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్) 4.0 ద్వారా ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మందికి స్క్రీనింగ్ చేసినట్లు...
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్) 4.0 ద్వారా ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మందికి స్క్రీనింగ్ చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం వెల్లడించారు. ఈ స్ర్కీనింగ్‌లో మహిళలకు నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్, మగవారికి నోటి క్యాన్సర్‌కు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. పరీక్షలు చేయించుకున్న మహిళల్లో 9,963 మందిలో రొమ్ము క్యాన్సర్, 22,861 మందిలో సర్వైకల్ క్యాన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించామని చెప్పారు. అలాగే మగవారిలో నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న 26,639 మందిని గుర్తించామన్నారు.
టెలీమాన్‌సపై ఫ్యాన్సీడ్రెస్.. చిన్నారికి సత్యకుమార్ అభినందన
మంగళగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో.. ఎల్‌కేజీ విద్యార్థిని రవిశ్రీ.. టెలీమానస్ టోల్‌ఫ్రీ నంబర్ 14416 వేషధారణతో అందరినీ ఆకట్టుకుంది. మానసిక ఆరోగ్య సహాయ కేంద్రమైన ‘టెలీమాన్‌స’పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించిన ఈ చిన్నారిని మంత్రి సత్యకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.