AP Cabinet Sub-Committee: ఆదాయం వచ్చేలా రుషికొండపై నిర్ణయం
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:30 AM
పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా, ప్రజలకు ఉపయోగపడేలా రుషికొండ ప్యాలె్‌సపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రులు పయ్యావుల కేశవ్...
మంత్రుల వెల్లడి.. సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా, ప్రజలకు ఉపయోగపడేలా రుషికొండ ప్యాలె్‌సపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఈ ప్యాలె్‌సను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది. గత భేటీలో సూచనల మేరకు ప్రజలు, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాన్ని పర్యాటక శాఖ అధికారులు దాని ముందుంచారు. సమావేశం ముగిశాక మంత్రులు మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం రుషికొండపై ఏడు బ్లాక్‌లతో, 19,968 చదరపు మీటర్లలో రాజప్రసాదం లాంటి ప్యాలె్‌సను నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. దానివల్ల ప్రస్తుతం ప్రతి నెలా రూ.25-30 లక్షలు నిర్వహణ చార్జీల భారం పడుతోంది. ఇప్పటికే టాటా, అట్మాస్ఫియర్ కోర్, హెచ్‌సీఎల్, హెచ్‌ఈఐ హోటల్స్ తదితర సంస్థలు ప్యాలెస్ వినియోగంపై తమ అభిప్రాయాన్ని తెలిపాయి. మరికొన్ని విదేశీ సంస్థలు కూడా వ్యక్తీకరణలో పాలుపంచుకున్నాయి. సాధ్యమైనంత త్వరగా మరోసారి భేటీ అవుతాం. 2-3 ప్రతిపాదనలు క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాం. అనంతరం సీఎం సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం’ అని వివరించారు.