Share News

Ministerial Discussions: నేడు క్యాబినెట్‌ భేటీ

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:54 AM

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై...

Ministerial Discussions: నేడు క్యాబినెట్‌ భేటీ

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై విధివిధానాలను చర్చించి ఆమోదం తెలిపనున్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి అధికారికంగా పేరుకూడా ఖరారు చేయనున్నారు. భవన క్రమబద్ధీకరణ స్కీంపైనా చర్చించే అవకాశం ఉంది. గత క్యాబినెట్‌లో దీనిపై చర్చ జరిగినా నిర్ణయం తీసుకోలేదు. సీఎం బృందం సింగపూర్‌ టూర్‌పైన, లిక్కర్‌ స్కాంలో తాజా పరిణామాలపైనా మంత్రి వర్గ సహచరులతో సీఎం చర్చించే అవకాశం ఉంది.

Updated Date - Aug 06 , 2025 | 05:55 AM