Share News

Buditi Rajashekhar: బుడితి రాజశేఖర్‌కు ఇంకోసారిమరో ఏడాది సర్వీసు

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:45 AM

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Buditi Rajashekhar: బుడితి రాజశేఖర్‌కు ఇంకోసారిమరో ఏడాది సర్వీసు

అమరావతి, డిసెంబరు 29(అంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజశేఖర్‌ గత ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేశారు. ఆయనకు ప్రభుత్వం ఏడాది కాలం సర్వీసును పొడిగించి ంది. ఈ నెలాఖరులో రాజశేఖర్‌ పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన సేవలను మరో ఏడాది పొడిగించాలని చంద్రబాబు నిర్ణయించారు. మంగళ, బుధవారాల్లో అధికారిక ఉత్తర్వు విడుదల కానుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Dec 30 , 2025 | 04:45 AM