Share News

మెగా పేరెంట్స్‌ మీట్‌కు బడ్జెట్‌

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:44 PM

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5వ తేదీన ప్రభుత్వ, అన్ని ఎయిడెడ్‌ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్స్‌ మీట్‌ కోసం జిల్లాలోని 1,482 పాఠశాలలకు రూ.54,61,650 బడ్జెట్‌ను విడుదల చేశారు.

   మెగా పేరెంట్స్‌ మీట్‌కు బడ్జెట్‌

1,482 పాఠశాలలకు రూ. 54,61,650

కర్నూలు ఎడ్యుకేషన, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5వ తేదీన ప్రభుత్వ, అన్ని ఎయిడెడ్‌ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్స్‌ మీట్‌ కోసం జిల్లాలోని 1,482 పాఠశాలలకు రూ.54,61,650 బడ్జెట్‌ను విడుదల చేశారు. ఒక్కొక్క పాఠశాలకు విద్యార్థుల ఎనరోల్‌మెంటు ప్రకారం మెగా పేరెంట్స్‌ మీటింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ యాజమాన్య పాఠశాలల్లో సమగ్ర శిక్ష శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పీటీఎం-3 నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఏర్పాట్లన్నింటిలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర శిక్ష ఏపీసీ చర్యలు తీసుకుంటున్నారు. 0 నుంచి 30 విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.900, 31 నుంచి 100లోపు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలకు రూ.2250లు, 101 నుంచి 250 మందిలోపు ఉన్న విద్యార్థుల పాఠశాలలకు రూ.4,500, 251 నుంచి వేయిలోపు సంఖ్య ఉన్న పాఠశాలలకు రూ.6,750, వేయికి ఆ పైన ఉన్న పాఠశాలలకు రూ.9వేలు పేరెంట్స్‌ టీచర్స్‌ మీట్‌కు ఖర్చు చేసేందుకు నిధులు కేటాయించారు. గత ఏడాది పేరెంట్స్‌ మీట్‌ స్పూర్తితో ఈ నెల 5వ తేదీన పీటీఎం-3కు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల చేత ముఖ్య అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపిణీ, పాఠశాలల సుందరీకరణ తదితర పనులు చేయిస్తున్నారు. పీటీఎం విజయవంతం చేసేందుకు సమగ్రశిక్ష ఏపీసీ చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:44 PM