Buddha Venkanna: లక్ష కోట్లు దోచిన జగన్‌కు పరకామణి కేసు చిన్నదే
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:34 AM
రూ.లక్ష కోట్లు దోచుకున్న జగన్.. టీటీడీ పరకామణి కేసు వ్యవహారం చాలా చిన్నదేనని చెప్పటంలో ఆశ్చర్యం లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.
అబద్ధపు ప్రచారాలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న
విజయవాడ (వన్‌టౌన్), డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రూ.లక్ష కోట్లు దోచుకున్న జగన్.. టీటీడీ పరకామణి కేసు వ్యవహారం చాలా చిన్నదేనని చెప్పటంలో ఆశ్చర్యం లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలోని ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరాకామణి కేసును జగన్ చిన్న తప్పు అనడం కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు. రవికుమార్ నుంచి ఎవరు ఎంత ఆస్తులు రాయించుకున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో రవికుమార్‌ను ఎందుకు జగన్ వెనకేసుకు వస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. చిన్న వ్యాపారం చేసే రవికుమార్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చా యో జగన్ సమాధానం చెప్పాలన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా సెటిల్‌మెంట్ జరిగిందన్నారు. పరాకామణి కేసులో నిజాలు బయటకు వస్తాయని రవికుమార్‌ను హత్య చేసే అవకాశం ఉందని బుద్దా వెంకన్న అనుమానం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్న జగన్ మోకాళ్లపై కూర్చుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోసారి అబద్ధాలు ప్రచారం చేస్తే జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని నోరు పారేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పిచ్చివాగుడు వాగితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.