Share News

Chinturu: రోడ్డు ప్రమాదంలో జవాన్‌ మృతి

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:09 AM

రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్‌ జవాను మరణించారు. మరో ఆరుగురు జవాన్లు గాయాలపాలయ్యారు.

Chinturu: రోడ్డు ప్రమాదంలో జవాన్‌ మృతి

  • మరో ఆరుగురు జవాన్లకు గాయాలు

  • అల్లూరి జిల్లాలో కల్వర్టును ఢీకొన్న కారు

  • సెలవు ముగిసి.. విధుల్లోకి వెళ్తుండగా ఘటన

చింతూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్‌ జవాను మరణించారు. మరో ఆరుగురు జవాన్లు గాయాలపాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం గొర్లగూడెం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిందీ ప్రమాదం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఒడిసాలోని బలిమెల విద్యుత్‌ ఉత్పాదక రిజర్వాయర్‌ వద్ద బీఎ్‌సఎఫ్‌ జవాన్లు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో కొందరు ఇటీవల సెలవుపై స్వస్థలాలకు వెళ్లారు. సెలవు ముగియడంతో ఏడుగురు జవాన్లు తిరిగి బలిమెలకు పయనమయ్యారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి వారంతా కారులో చింతూరు మీదుగా బలిమెల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జవాను అజిత్‌ సింగ్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా.. నిద్రమత్తు వల్ల 30వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కల్వర్టును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బీఎ్‌సఎఫ్‌ జవాను గౌరవ్‌ కుమార్‌పాండే(43) అక్కడికక్కడే మృతి చెందారు. జవాన్లు అమితాబ్‌సింగ్‌, ఎండీ జామిన్‌, దేవ్‌కుమార్‌, గూర్జిత్‌సింగ్‌, వాసవభగత్‌సింగ్‌, అజిత్‌ సింగ్‌ గాయాలపాలయ్యారు. చింతూరు పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Oct 22 , 2025 | 06:12 AM