CM Chandrababu: రాష్ట్రంలో బ్రూక్‌ఫీల్డ్ భారీ పెట్టుబడులు
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:14 AM
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో ఒప్పందం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
లక్ష కోట్ల పెట్టుబడి.. 3 గిగావాట్ల డేటా సెంటర్ సీఎం చంద్రబాబు వెల్లడి
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో ఒప్పందం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘మన రాష్ట్రంలో 12 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడుల కోసం బ్రూక్‌ఫీల్డ్‌తో అవగాహన ఒప్పందం జరిగింది. ఇందులో క్లీన్ ఎనర్జీ ఇంధనాన్ని వినియోగించే 3 గిగావాట్ల డేటా సెంటర్‌తో పాటు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ ప్లాంటులు ఉంటాయి. అలాగే రాష్ట్రంలో మాడ్యూల్ మాన్యుఫ్యాక్చరింగ్, సప్లయ్ చైన్, గ్రీన్ మాలిక్యూల్స్, ఆతిథ్యం, జీసీసీ, కమర్షియల్ రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పోర్టులు, మొబిలిటీ, లాజిస్టిక్స్ హబ్స్, పారిశ్రామిక టౌన్‌షి్‌ప్సలో ఉన్న అవకాశాలను కూడా బ్రూక్‌ఫీల్డ్ అన్వేషిస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వారికి అవసరమైనవి సమకూర్చుతాం’’ అంటూ సీఎం పేర్కొన్నారు.