Bride: జేసీబీ ఎక్కి.. వాగు దాటి..
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:05 AM
వధూవరులిద్దరూ పక్కపక్క గ్రామాలకు చెందినవారే. రెండింటి మధ్యదూరం మూడు కిలోమీటర్లు.
వరద కష్టాన్ని దాటి పెళ్లి మండపానికి నవ వధువు
జరుగుమల్లి (కొండపి), అక్టోబరు30(ఆంధ్రజ్యోతి): వధూవరులిద్దరూ పక్కపక్క గ్రామాలకు చెందినవారే. రెండింటి మధ్యదూరం మూడు కిలోమీటర్లు. అయితే వాగు ఉధృతి కారణంగా వధువు పెళ్లి వేదికకు చేరే వీలు లేకుండాపోయింది. దీంతో బంధువులు ఆందోళన పడుతుండగా సమాచారం అందుకున్న జరుగుమల్లి పోలీసులు ఎక్స్‌కవేటర్ తెప్పించి సకాలంలో వధువును మండపానికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. వివరాలివీ..వరుడు ఎండ్లూరి సుధాకర్‌ది ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామం. వధువు ఆత్మకూరి అంజలిది పక్కనే సాధువారిపాలెం. రెండు గ్రామాలూ పక్కపక్కనే ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం సింగరాయకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. సాధువారిపాలెం నుంచి వధువు బయలుదేరాల్సి ఉండగా.. ఇరువైపులా ముసి ప్రవహిస్తుండటంతో కదిలే వీల్లేకపోయింది. సమాచారం అందుకున్న జరుగుమల్లి ఎస్‌ఐ మహేంద్ర....ఎక్స్‌కవేటర్‌ను సాధువారిపాలెం పంపించారు. వధువు, బంధువులను ఎక్స్‌కవేటర్‌లో పలు దఫాలుగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వధువు సింగరాయకొండ చేరుకోవడంతో.. అక్కడ పెళ్లి వైభవంగా జరిగింది.