MLA Nakka Anand Babu: వైసీపీని రాష్ట్రం నుంచి బాయ్‌కాట్ చేయాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:18 AM
చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు కుట్ర చేసిన వైసీపీని రాష్ట్రం నుంచి...
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణం: నక్కా ఆనంద్ బాబు
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు కుట్ర చేసిన వైసీపీని రాష్ట్రం నుంచి బాయ్‌కాట్ చేయాలని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు కోరారు. ‘రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దల డైరెక్షన్‌తోనే వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నించిన వైసీపీ నీచ సంస్కృతిని ప్రజా, కుల సంఘాలు ముక్తకంఠంతో ఖండించాలి. క్రూరత్వమే తప్ప మానవత్వం తెలియని నేతలు తాడేపల్లి ప్యాలె్‌సలో ఉన్నారు’ అని ఆనంద్‌బాబు విమర్శించారు.