వేటు వేసే హక్కుంటే ఎందుకు ఆగుతున్నారు: బొత్స
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:54 AM
శాసనసభకు ఆరు నెలలపాటు హాజరుకాని సభ్యులపై అనర్హత వేటు వేస్తామని అసెంబ్లీ స్పీకర్ తరచూ చెబుతున్నారు.
విశాఖపట్నం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘శాసనసభకు ఆరు నెలలపాటు హాజరుకాని సభ్యులపై అనర్హత వేటు వేస్తామని అసెంబ్లీ స్పీకర్ తరచూ చెబుతున్నారు. ఆ హక్కు ఉంటే ఎందుకు ఆగుతున్నారు?’ అని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నగరంలోని ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీకి వెళ్లినా ఉపయోగం లేదు కాబట్టే మా పార్టీ అధ్యక్షుడు జగన్ నేరుగా ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు’ అన్నారు.