Share News

దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:42 AM

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా కృష్ణా జిల్లాకు చెందిన బొర్రా రాధాకృష్ణ (గాంధీ) నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.

దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ

- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

- రాధాకృష్ణది కృష్ణాజిల్లా పోరంకి

విజయవాడ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా కృష్ణా జిల్లాకు చెందిన బొర్రా రాధాకృష్ణ (గాంధీ) నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలు, టీటీడీ ఆలయాల స్థానిక సలహా మండలి చైర్మన్లను నియమించింది. ఇందులో రాధాకృష్ణను దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌ పదవి వరించింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి, ఆ ప్రకటన చేసినప్పటి నుంచి రాధాకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీ ప్రకటన జరిగినప్పుడు విద్యార్థి నాయకుడిగా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఆయన భవన నిర్మాణ రంగంలో ఉన్నారు. మరోపక్క పార్టీ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సన్నిహితుడిగా రాధాకృష్ణకు గుర్తింపు ఉంది. రాధాకృష్ణకు అనుకూలంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఇద్దరు ఎంపీలు, ఇద్దరు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారు. దీంతో సౌమ్యుడిగా పేరు ఉన్న రాధాకృష్ణను ప్రభుత్వం ధర్మకర్తల మండలి చైర్మన్‌గా నియమించింది.

Updated Date - Sep 19 , 2025 | 12:42 AM