రైస్ కెర్నెల్స్ తయారీలో స్థానిక కంపెనీలకు ప్రోత్సాహం: నాదెండ్ల
ABN , Publish Date - Sep 20 , 2025 | 07:20 AM
ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ తయారీలో 25 శాతం టెండర్లను స్థానిక కంపెనీలకు కేటాయిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ తయారీలో 25 శాతం టెండర్లను స్థానిక కంపెనీలకు కేటాయిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రకటించారు. స్థానిక కంపెనీల కంటే ఇతర రాష్ట్రాల్లోని సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తావించారు. దీనిపై మంత్రి మాట్లాడు తూ.. రాష్ట్రంలోని సంస్థలు కోట్ చేస్తున్న ధరలకు, ఇతర రాష్ట్రాల సంస్థల ధరలకు చాలా వ్యత్యాసం ఉంటోందని చెప్పారు. గతంలో ఫోర్టిఫైడ్ రైస్ కోసం 2 టెండర్లు పిలిచామని, 22,500 టన్నులను బయట రాష్ట్రాల్లోని సంస్థలకు, ఏపీలోని సంస్థలకు 7,500 టన్నులు కేటాయించామని చెప్పారు. జూన్‌లో కేంద్రం కొత్త నిబంధనలు సూచించిందని తెలిపారు. ఈ నిబంధనల మేరకు కొత్తగా ఖరీఫ్ సీజన్‌లో టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు.