Share News

No Magic No Illusion: మాయాలేదు.. గారడీ కాదు

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:56 AM

కళ్లకు గంతలు కడితే మనం తడబడతాం.. నాలుగు అడుగులు వేస్తే తుళ్లిపడతాం. కానీ ఓ 11 ఏళ్ల చిన్నారి మాత్రం కళ్లకు గంతలు కట్టినా ఏమాత్రం ఏ మాత్రం తడబడకుండా వస్తువులను...

No Magic No Illusion: మాయాలేదు.. గారడీ కాదు

కళ్లకు గంతలు కట్టినా సునాయాసంగా వస్తువులు, అక్షరాల గుర్తింపు

  • గాంధారి విద్యలో చిన్నారి సాత్విక ప్రతిభ

  • భగవద్గీత, రామాయణాన్ని కంఠస్థం చేసిన ప్రీతమ్‌

  • అబ్బురపరుస్తున్న చిన్నారులు

(తాడిపత్రి-ఆంధ్రజ్యోతి)

కళ్లకు గంతలు కడితే మనం తడబడతాం.. నాలుగు అడుగులు వేస్తే తుళ్లిపడతాం. కానీ ఓ 11 ఏళ్ల చిన్నారి మాత్రం కళ్లకు గంతలు కట్టినా ఏమాత్రం ఏ మాత్రం తడబడకుండా వస్తువులను, అక్షరాలను సునాయాసంగా గుర్తుపట్టేస్తుంది. అంతేకాకుండా బొమ్మలు కూడా అందంగా గీస్తుంది. ఇందులో మాయాజాలం ఏమీలేదు, గారడి అంతకన్నా కాదు. అది అభ్యాసంతో వచ్చిన విద్య మాత్రమే. తిరుపతిలో నివాసం ఉంటున్న సురేఖ, అయ్యప్ప దంపతుల కుమార్తె సాత్విక ‘గాంధారి విద్య’లో ప్రావీణ్యం సంపాదించింది. కళ్లకు గంతలు కట్టుకుని చదవడం, రాయడం, బొమ్మలు గీయడం, పెయింటింగ్‌ వేయడాన్ని గాంధారి విద్య అంటారు. ఈ కళలో ఆ చిన్నారి నైపుణ్యం సాధించింది. సాత్విక తమ్ముడు ప్రీతమ్‌ కార్తీక్‌ మరో కళలో నిష్ణాతుడు. ఏడేళ్ల వయసులోనే రామాయణం, భగవద్గీతలను కంఠస్థం చేసేశాడు. వాటిలో శ్లోకాలను అనర్గళంగా చెప్పగలడు. దసరా సెలవులకు తమ సొంతూరు తాడిపత్రికి వచ్చిన ఈ చిన్నారుల ప్రతిభ గురించి తెలుసుకున్న బంధుమిత్రులు, స్థానికులు ప్రత్యక్షంగా తిలకించేందుకు ఆసక్తిగా వారింటికి వచ్చారు. అందరి ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని సాత్విక బొమ్మలను, రంగులను, అంకెలను గుర్తు పట్టి చెప్పేసింది. పుస్తకాల్లోని అక్షరాలను చదివింది. బొమ్మలు గీసి, వాటికి రం గులు అద్దింది. సాత్వికలో ఇలాం టి ప్రతిభ ఉందని చిన్నతనంలోనే తల్లిదండ్రులు గుర్తించారు. కర్ణాటకలోని హోస్పేట జిల్లా కూడ్లిగి పట్టణంలో గాంధారి విద్యలో శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని అక్కడికి పంపించారు. స్మె ల్‌, టచ్‌, స్కానింగ్‌ పక్రియల్లో శిక్షణ ఉంటుందని, వాటిని కేవలం పది రోజుల్లోనే తమ కుమార్తె నేర్చుకుందని తల్లి సురేఖ తెలిపారు. సురేఖ టీటీడీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప సివిల్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నారు.

2.jpg

Updated Date - Oct 05 , 2025 | 03:56 AM