Tirumala: కలత లేదు సోదరా.. నేను నీకు ఆసరా
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:12 AM
బెంగళూరుకు చెందిన జగేంద్ర చిన్నతనంలోనే చూపు కోల్పోయాడు. చేతికర్ర సాయంతో నడవడంలో ఇటీవల శిక్షణ తీసుకున్నాడు.
వైకల్యాన్ని మరిచి నడక మార్గాన వెంకన్న దర్శనానికి
తిరుమల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): బెంగళూరుకు చెందిన జగేంద్ర చిన్నతనంలోనే చూపు కోల్పోయాడు. చేతికర్ర సాయంతో నడవడంలో ఇటీవల శిక్షణ తీసుకున్నాడు. ఈ సమయంలో 20శాతం మాత్రమే చూపున్న శశికిరణ్ అతనికి స్నేహితుడయ్యాడు. తిరుమల కొండకు నడిచి చేరుకోవాలనే తన చిరకాల కోరికను స్నేహితుడికి తెలిపాడు. ఇద్దరూ కలిసి శనివారం ఉదయం శ్రీవారిమెట్టు దారిలో కర్రలు తాటించుకుంటూ 2,400 మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు.