BJP Spokesperson Yamini: దొంగలే జాగ్రత్తలు చెబుతున్నారు
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:10 AM
వైసీపీ చేసే అబద్ధపు ప్రచారాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని వ్యాఖ్యానించారు.
వైసీపీ అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దు: యామిని
విజయవాడ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ చేసే అబద్ధపు ప్రచారాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని వ్యాఖ్యానించారు. దొంగలున్నారు జాగ్రత్త అని దొంగలే అన్నట్టు వారి మాటలున్నాయని ఎద్దేవా చేవారు. జగన్, అతని అనుచరులు పచ్చి అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లగల నిపుణులని విమర్శించారు. ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారనే వంకతో వైసీపీ వాళ్లు ఆందోళనకు దిగుతున్నామని చెబుతున్నారు. కానీ, పీపీపీ అంటే కూడా జగన్‌కు తెలియదు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు కొల్లగొట్టారు.’ అని ధ్వజమెత్తారు.