BJP Plans Massive BC Rally: త్వరలో ఐదు లక్షల మందితో బహిరంగ సభ: ఆర్.కృష్ణయ్య
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:33 AM
ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఐదు లక్షల మంది బీసీలతో త్వరలో రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
విజయవాడ (గాంధీనగర్), డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఐదు లక్షల మంది బీసీలతో త్వరలో రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేష్ అధ్యక్షతన బీసీ కుల సంఘాల సమావేశం ఆదివారం జరిగింది.ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో అనేక సంస్కరణలు చేపట్టినా బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాది ఆకలి పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించే ఉద్యవ ూన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. ప్రధాని మోదీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. మారేష్ మాట్లాడుతూ బీసీల హక్కులపై కూటమిలోని బీసీ ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు. 139కి పైగా కుల సంఘాలు ఎదురుచూస్తున్న కులగణన తేదీని ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.