బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోంది: షర్మిల
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:06 AM
బీజేపీ ప్రభు త్వం ఓటు చోరీకి పాల్పడుతోందని, ఎన్నికల కమిషన్ బీజేపీ తొత్తుగా మారిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్), సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రభు త్వం ఓటు చోరీకి పాల్పడుతోందని, ఎన్నికల కమిషన్ బీజేపీ తొత్తుగా మారిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఓటు చోరీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా శనివారం విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ డాబా కొట్లు వద్ద సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ గెలుపు కష్టమనుకున్న చోట్ల దొంగ ఓట్లు చేర్చి బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు.