BJP Chief Madhav: కేరళ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ మాధవ్ ఫైర్
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:49 AM
అయ్యప్ప ఆలయ ప్రాశస్త్యాన్ని కేరళలోని నాస్తిక ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం దురుద్దేశంతోనే దెబ్బ తీస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు...
శబరిమల పోలీసులపై చర్యలకు డిమాండ్
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అయ్యప్ప ఆలయ ప్రాశస్త్యాన్ని కేరళలోని నాస్తిక ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం దురుద్దేశంతోనే దెబ్బ తీస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. అయ్యప్ప భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేయలేక పోలీసులతో భక్తులపై దాడులు చేయించడం సిగ్గు చేటని మండిపడ్డారు. భక్తుల పట్ల కేరళ పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమని ఓ ప్రకటనలో మండిపడ్డారు.