BJP: వికసిత్ భారత్.. వికసిత్ ఏపీ కోసం కృషి చేద్దాం
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:32 AM
వికసిత్ భారత్, వికసిత్ ఏపీ’ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టుల కార్యశాల...
వర్క్‌షాపులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపు
మంగళగిరి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘వికసిత్ భారత్, వికసిత్ ఏపీ’ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టుల కార్యశాల శుక్రవారం మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌లాండ్‌లో జరిగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. స్వదేశీ ఉద్యమాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఏపీకి ఇప్పటికే రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రాష్ట్ర అభివృద్ధితో పాటు అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మళ్లీ అధికారంలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వారిలో మార్పు రాలేదని మాధవ్ విమర్శించారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణంతో ఎలాంటి నష్టం లేదని అన్నారు. కార్యశాలలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్‌డీ విల్సన్, ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.