BJP AP State Committee: 42 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:36 AM
బీజేపీ రాష్ట్ర కమిటీని 42మందితో ఏర్పాటు చేశారు. నలుగురు ప్రధాన కార్యదర్శులు, పది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మోర్చాలు, సెల్స్‌కు బాధ్యులను రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నియమించారు.
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కమిటీని 42మందితో ఏర్పాటు చేశారు. నలుగురు ప్రధాన కార్యదర్శులు, పది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మోర్చాలు, సెల్స్‌కు బాధ్యులను రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నియమించారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా చురుగ్గా పనిచేస్తున్న సన్నా దయాకర్ రెడ్డిని మరోమారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. నాగోతు రమేశ్ నాయుడు, మట్టా ప్రసాద్, కాకినాడలో కార్పొరేటర్‌గా విజయం సాధించిన లక్ష్మీ ప్రసన్నకు ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారు. ముఖ్య అధికార ప్రతినిధిగా వల్లూరు జయప్రకాశ్, మీడియా ఇన్‌చార్జిగా కిలారు దిలీప్, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా కేశవ్ కాంత్, ప్రొటోకాల్ ఇన్‌చార్జిగా పాతూరి నాగభూషణంకు అవకాశం దక్కింది. యువమోర్చా అధ్యక్షుడిగా కర్నూలు వాసి సునీల్ కుమార్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నిషిధ రాజు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా రొంగల గోపి శ్రీనివాస్, ఎస్‌సీ మోర్చా అధ్యక్షుడిగా పనతల సురేశ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా పాంగి రాజారావు, మైనార్టీమోర్చా అధ్యక్షుడిగా సయ్యద్‌బాషాను నియమించారు. కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా కుమార స్వామిని కొనసాగించారు.