మోదీ తల్లిపై విమర్శలు సిగ్గుచేటు: యామిని
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:07 AM
రాహుల్ గాంధీ బిహార్ పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ తల్లిని తీవ్రంగా అవమానించడం.. దేశంలోని తల్లులు, మహిళలందరినీ అవమానించినట్టేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని...
విజయవాడ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీ బిహార్ పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ తల్లిని తీవ్రంగా అవమానించడం.. దేశంలోని తల్లులు, మహిళలందరినీ అవమానించినట్టేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారమిక్కడ ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ‘సాక్షాత్తూ దేశ ప్రధాని తల్లిని తూలనాడడం సిగ్గుచేటు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకులపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం ఆ పార్టీకున్న కుసంస్కారాన్ని తెలియజేస్తోంది. రాహుల్ తల్లి, సోదరిపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాహుల్ ఊరుకుంటారా? దీనిపై సోనియా, షర్మిల ఇప్పటివరకు స్పందించకపోవడమేంటి?’ అని యామిని ప్రశ్నించారు.