Prakasam District: బిస్కెట్ ఆశచూపి ఇద్దరు బాలికలపై లైంగికదాడి
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:23 AM
అభంశుభం తెలియని బాలికలకు చాక్లెట్, బిస్కెట్లు ఇస్తానని ఆశచూపి ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నర్సాయపాలెంలో ఘటన, పోక్సో కేసు నమోదు
ఎర్రగొండపాలెం రూరల్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అభంశుభం తెలియని బాలికలకు చాక్లెట్, బిస్కెట్లు ఇస్తానని ఆశచూపి ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నర్సాయపాలెం గ్రామంలో పిక్కిలి ఆంజనేయులు(40)కు చిల్లర దుకాణం ఉంది. క్రిస్మస్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో ఆ దుకాణం సమీపంలో నివాసముంటున్న ఇద్దరు బాలికలు (10, 11 సంవత్సరాలు) బిస్కెట్లు కొనుక్కునేందుకు వెళ్లారు. వారిలో ఒక బాలికకు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశచూపిన ఆంజనేయులు నివాసం లోపలికి తీసుకెళ్లాడు. మరో బాలికకు అంట్లు తోమితే బిస్కెట్లు ఇస్తానని చెప్పాడు. ఆ బాలిక ఇంటి బయట అంట్లు తోముతుండగా మరో బాలికపై నోట్లో గుడ్డ కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే రెండో బాలికపై కూడా లైంగిక దాడి చేశాడు. అనంతరం ఇళ్లకు వెళ్లిన బాలికల వస్ర్తాలపై రక్తం మరకలు గమనించి ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని వారు తల్లిదండ్రులకు తెలిపారు. ఆగ్రహంతో వారంతా నిందితుడి ఇంటికి వెళ్లగా అప్పటికే ఆంజనేయులు పరారయ్యాడు. శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.