Industrial Expansion: నెల్లూరు జిల్లాలో ‘బిర్లాన్యూ’ ఫైబర్ సిమెంట్ ప్లాంట్
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:15 AM
నెల్లూరు జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంటు ఏర్పాటుకు ‘బిర్లాన్యూ’ బిల్డింగ్-మెటీరియల్స్, హోమ్ సొల్యూషన్ కంపెనీ ముందుకు వచ్చింది.
తొలిదశలో రూ.127 కోట్ల పెట్టుబడి.. 600 మందికి ఉద్యోగాలు.. సీఎండీ అక్షత్‌సేథ్
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి) : నెల్లూరు జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంటు ఏర్పాటుకు ‘బిర్లాన్యూ’ బిల్డింగ్-మెటీరియల్స్, హోమ్ సొల్యూషన్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకుగాను తొలిదశలో రూ.127 కోట్లు వెచ్చించనున్నట్లు ఆ కంపెనీ సీఎండీ అక్షత్ సేథ్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ స్థాపనతో 600 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు దక్కుతాయని వివరించారు. నెల్లూరు జిల్లాలో స్థాపించే ప్లాంటు బిర్లా న్యూ విస్తరణ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సేథ్ పేర్కొన్నారు. ఇక్కడ అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడిన భవన నిర్మాణ పరికరాలు డిజైన్ చేస్తామని చెప్పారు. తాము తయారు చేసే భవన పరికరాలు అందుబాటు ధరల్లో ఉంటాయని సేథ్ వెల్లడించారు. తమ ప్లాంట్ వల్ల నెల్లూరులో సర్క్యులర్ ఎకానమీ పెరుగుతుందని వివరించారు. రెండో దశలో పీవీసీ పైపులు, ఫిట్టింగులు వంటివాటి ఉత్పత్తితో పరిశ్రమను విస్తరించి, ఇంటిగ్రేటెడ్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తామన్నారు.